![]() |
![]() |

బాలీవుడ్ అగ్రనటుల్లో సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan)కూడా ఒకడు. సుదీర్ఘ కాలంగా చిత్రపరిశ్రమలో ఉంటు ఎన్నో మంచి చిత్రాల్లో నటిస్తు వస్తున్న సైఫ్ ఈ నెల 25 న తన అప్ కమింగ్ మూవీ 'జ్యుయల్ థీఫ్' తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 25 న నెట్ ఫ్లిక్స్ వేదికగా డైరెక్ట్ గా ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది. ఇక సైఫ్ రీసెంట్ గా ఖతర్(Qatar) దేశంలో ఒక విలాసవంతమైన ఇల్లుని కొనుగోలు చెయ్యడం జరిగింది.
ఈ విషయంపై సైఫ్ మాట్లాడుతు ఖతర్ చాలా విలాసవంతమైన, అందమైన దేశం. నా హాలిడే హోమ్ లాంటిది కూడా. ఇటీవల ఒక షూటింగ్ కి ఖతర్ వెళ్ళినపుడు ఈ ప్రదేశం నాకు ఎంతో ఆహ్లాదంగా అనిపించింది. దీంతో ఇల్లు కొన్నాను. అక్కడ ఉన్నన్ని రోజులు నా జీవనశైలి, ఆహారం కూడా మారిపోతాయి. ముఖ్యంగా ఖతర్ చాలా సురక్షితమైంది. అక్కడ ఒక ఇంటికి మరో ఇంటికి చాలా దూరం ఉంటుంది. నా ఫ్యామిలీని అక్కడకి షిఫ్ట్ చేసే రోజు కోసం ఎదురుచూస్తున్నానని తెలిపాడు. జనవరి లో సైఫ్ పై ఒక దుండగుడు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సైఫ్ ఖతర్ కి షిఫ్ట్ అవ్వాలనుకోవడం ప్రాధాన్యతని సంతరించుకుంది.
ఇక జ్యుయల్ థీఫ్(Jewel Thief)లో సైఫ్ వజ్రాలు దొంగతనం చేసే దొంగగా చేస్తున్నాడు. ఇటీవల రిలీజైన ట్రైలర్ తో మూవీపై అందరిలోను అంచనాలు పెరిగాయి. నికిత దత్త, జైదీప్ అహ్లావత్, కునాల్ కీలక పాత్రలు పోషించగా కూకీ గులాటి, రాబి గ్రే వాల్ ద్వయం దర్శకత్వం వహించింది.
![]() |
![]() |